Monday, October 11, 2010

నేను మానసికరోగిని కాను : రాంగోపాల్ వర్మ

 నేను అక్టోబర్ 4 న పోస్ట్ చేసిన " రాంగోపాల్ వర్మా !? ... అతనో మానసికరోగి " అనే ఆర్టికల్ కు రాము సమాధానం సాక్షి ఫన్ డే (10-10-2010)లో వచ్చింది. సాధరణంగా నాకు సాక్షి చూసే అలవాటులేదు ... అనుకోకుండా ఒక స్నేహితుడి ఇంట్లో పేపరు తిరగేస్తుంటే ఇది నాకంట పడింది .దానిని యధాతధంగా దిగువ ఇస్తున్నాను ... అందులో చాలా విషయాలు నేను రాసిన విషయాలతో ఏకీభవిస్తూనే తనదైన శైలిలో సమాధానమిచ్చాడు రాము  అని నా భావన.తాను మానసికరోగిని కానని ... కాకపోతే నా ప్రపంచంలో నేనుంటానని రాము ఉద్దేశ్యం. నా ఆర్టికల్ కు రామూ స్పందిస్తాడని నేను ఊహించలేదు ...కానీ స్పందిస్తే బాగుండును అని అనుకున్నాను .తనదైన బాణీలో స్పందించినందుకు రామూకి కృతజ్ఞతలు.
   
 - థాంక్స్ టు రాము

2 comments:

  1. దాదాపుగా అన్ని పత్రికల ఆదివారం మేగజైనులు ఒక వారం ముందుగానే ప్రింట్ అయిపొతాయి , సాక్షి మేగజైను ఎప్పుడూ రెండు వారాల పుస్తకాన్నిరెడీగా వుంచుతుంది అంటే ఈ రొజుకే వారి వద్ద తరువాతి ఆదివారం పత్రిక సిద్దంగా వుండటమే కాకుండా ఆ తరువాతివారానికి ప్రింటింగ్ కి వెల్లాల్సిన ప్రతిని సిద్దంచేస్కుంటారు. అదీ కాకుండా వర్మ లాంటి వారినించి అప్పట్టికప్పుడు కాకుండా రెండూ లేదా నాలుగు వారాలకు సరిపడ మేటరు పత్రిక వారు ముందుగానే తెప్పించుకుంటారు, మీరు పొస్టింగు చేసిన తేదీ కి కనీసం రెండు రొజు ల ముందే ఆ ఫీసులొ విదుదలకావాల్సిన కాపి వుండివుంటుంది, ఇది కాకతాళీయంగ జరిగిన విషయమే , మీకు విషయం తెలుస్తుదని ఇస్తున్నా తప్పుగా అనుకొవద్దు.

    ReplyDelete
  2. రామ్ గోపాల్ వర్మ రెండేళ్ళముందే తన బ్లాగులో[rgvzoomin.com] ఇంగిలీసులో రాసుకున్న రాతల్ని సాక్షీ మొన్నామద్యనుంచి తెలుగులో తిప్పి రాస్తుంది..అంతేగానీ మీకు సమాధానంగా కాదు.

    ReplyDelete