Monday, October 4, 2010

రాంగోపాల్ వర్మా !? ... అతనో మానసికరోగి

రాంగోపాల్ వర్మని జాగ్రత్తగా గమనించేవాళ్ళకి కలిగే అభిప్రాయమిది. తల - తోక లేని స్టేట్మెంట్లు ఇవ్వడం ...  సినిమాలకు పైశాచిక ఇతివృత్తాలను కథలుగా ఎంచుకోవడం  ... ఒంటరిగా కూర్చుని తెరిచివున్న కిటికీలోంచి గంటలు తరబడి గాల్లోకి చూస్తూ ఉండిపోవడం ... ఎవరితోనూ సరైన సంబంధాలు నెరపకపోవడం ... విపరీతమైన ఇగో ప్రదర్శించడం ... ఇవన్నీ వర్మ లక్షణాలు. నువ్వొక మానసికరోగివి అంటే ... రాము ఒప్పుకోడు ... పైగా డబాయిస్తాడు ... ఈ రోజుల్లో రోగం లేనిదెవరికి ? - అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఎప్పుడూ తన తప్పును ఒప్పుకోడు . మీ సినిమా ప్లాపయ్యింది కదా అంటే ... అదేం కాదు జనానికి సినిమా చూడడం చేతకాలేదు అంతే అంటాడు. మీరు తీసే పిచ్చి సినిమాలు జనానికి నచ్చాలని రూలేం లేదు కదా ?- అంటే ... చిరాగ్గా మొహం పెట్టి నా సినిమాలన్నీ Advanced గా ఉంటాయ్ ... వాటిని అర్ధం చేసుకోవాలంటే జనానికి చాలా మానసిక పరిణితి అవసరం, అందుకు చాలా ఏళ్ళు పడుతుంది అంటాడు. నా Freqency కి ప్రేక్షకుల Freqency match  కావడం లేదు ... అందుకే ప్లాపవుతున్నాయేమో అంటాడు. జనం Freqency కి match అయ్యే సినిమాలు తీయొచ్చుకదా అంటే ... నేనెవరి కోసమో సినిమాలు తీయను ... నాకోసమే తీస్తాను అంటాడు. నా సినిమా ఆడినా ఆడకపోయినా నాకేం పర్లేదు ... బొంబాయి చుట్టుపక్కల నా సినిమాలంటే పడి సచ్చే జనం ఉన్నారు. వాళ్ళకు నచ్చితే చాలు నా డబ్బులు నాకొస్తాయ్ అంటాడు . సినిమాలు తనకోసమే అయినప్పుడు  తనే ఇంట్లో ఒంటరిగా కూర్చుని గోళ్ళు కొరుక్కుంటూ హోం థియేటర్లో చూసుకోవచ్చుకదా ? జనం మీదకి వదలడమెందుకు ? పోనీ తీసే సినిమాలైనా వినోదాత్మకమైనవీ సందేశాత్మకమైనవీ తీయొచ్చుకదా అంటే ... నేను చెప్పే తొక్కలో సందేశం కోసం ఎవడూ నా సినిమాకి రాడు అంటాడు.
         కొత్తదనం అంటే అసలేమాత్రం నచ్చని మనిషి రాము . తీసిన సినిమాలనే తిప్పితిప్పి రకరకాలుగా తీస్తుంటాడు ... అవే థీం లు, అవే కథలు, అవే స్క్రీన్ ప్లేలు , అవే లైటింగ్ ఎఫెక్టులు, అవే చేజింగులు  ... వర్మ సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే అంశాలు . ప్రతిసారీ పాత చింతకాయ పచ్చడేనా? వెరైటీ వద్దూ ? అంటే ... హం ఆప్ కే హై కౌన్ లాంటి సినిమాలు తీయడం నావల్ల కాదు అంటాడు. నిజజీవితంలో అలాంటి సన్నివేశాలు ఉండవు అని తప్పించుకుంటాడు . పోనీ పెద్ద హీరోలు, పేరున్న హీరోలతో సినిమాలు తీయొచ్చుకదా అంటే ... మనోడికి ఇగో ప్రాబ్లం. నేనెళ్ళి వాళ్ళనడిగేదేంటి ... వాళ్ళే వచ్చి నన్నడాగాలి - నాకో సినిమా చేసిపెట్టమని అంటాడు. వాళ్ళెందుకు అడుగుతారు ... వాళ్ళకు ఈయనకంటే ఇగో కదా !.  ఇలాగే పదేళ్ళ క్రితం పాపం అశ్వనీదత్ వర్మను, చిరంజీవిని కలపాలని రెండు సినిమాలు ప్లాన్ చేసాడు. ఒకటి మృత్యుంజయుడు రెండోది మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ. మొదటి దాన్లో చిరు హీరో అయితే రాము దర్శకుడు, హీరోయిన్ టాబు. రెండో దాన్లో హీరో చిరంజీవి ఫేన్ . దానికే గెడ్డం చక్రవర్తి హీరో , దర్శకుడు . ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో రెండూ మధ్యలో ఆగిపోయాయి. ఆ మొదటి సినిమాలోని రెండు పాటల్నే చూడాలని ఉంది సినిమాకి వాడుకున్నారు. తనకన్నా పెద్ద ఇమేజ్ ఉన్నవాళ్ళతో కలవడానికి రామూ ఒప్పుకోడు. వాళ్ళు ఎక్కడ తనను డామినేట్ చేస్తారోనని భయం ఇదే జబ్బు అతని స్కూల్ నుండి వచ్చిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది. పలానా హీరోతో మీరు సినిమా ఎందుకు చెయ్యడంలేదు అంటే రామూ ఏమంటాడో తెలుసా ... నా కథ ఎవర్ని డిమాండ్ చేస్తే వాళ్ళతోనే సినిమా తీస్తాను అని తెలివిగా తప్పించుకుంటాడు. నా దృష్టిలో అది తెలివి అనిపించుకోదు ...  Escapism అనిపించుకుంటుంది. అంతేకాదు తన శిష్యులుగా తనకంటే తెలివైన వాళ్ళను సెలెక్ట్ చేసుకోడు ... వాళ్ళు తనను డామినేట్ చేస్తారని భయం ... పైగా తెలివైన లీడర్ ఎప్పుడూ తనకంటే తెలివైన వాళ్ళను టీం మెంబర్లుగా పెట్టుకోకూడదు అనుకుంటాడు రాము. నా దృష్టిలో దర్శకుడంటే ఎటువంటి ఇమేజున్న హీరోనైనా డీల్ చేయగలగాలి.  రామూతో మాట్లాడేటప్పుడు తప్పకుండా వచ్చే ప్రస్తావన శ్రీదేవి విషయం. శ్రీదేవితో తన వన్ - సైడ్ ప్రేమ గురించి చెప్పకుండా ఉండడు . కేవలం శ్రీదేవి కోసమే వందల సార్లు చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయంటాడు వర్మ. అంత ప్రేమించినవాడు అప్పట్లోనే ఆమెతో చెప్పి ఉండాల్సింది ... తాడో పేడో తేలిపోను.  అలా చేయకుండా పెళ్ళైన తరువాత కూడా ప్రేమిస్తున్నాను ... ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాను అంటే ... అది పద్దతి కాదు కదా !?. అప్పట్లోనే శ్రీదేవిని ప్రేమించిన వాళ్ళు ఆంధ్రదేశంలో గుట్టలు గుట్టలుగా ఉండేవాళ్ళు (ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి). ఆ మాట కొస్తే శ్రీదేవిని ప్రేమించనివాడెవడు? సంతోషంగా సంసార పక్షంగా సంసారం చేసుకుంటున్న శ్రీదేవితో ఇలాగేనా ప్రవర్తించేది . పాపం బోనీ కపూర్ గతేం కావాలి. రామూ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు చెప్పడు. పెళ్ళైందో లేదో తెలీదు. ఒకవేళ అయ్యుంటే పెళ్ళాం బిడ్డలు ఈయనతో ఎలా వేగుతున్నారో ఏంటో ? ఇప్పుడు చెప్పండి ...  రామూని ఏమనాలో ?                              

6 comments:

  1. అలాంటి సినిమాలు తీస్తే రాంగోపాల్ వర్మ అప్పులపాలు అవుతాడు. శివ సినిమా హిట్టయ్యిందని జనం అలాంటి సినిమాలనే చూస్తారనుకోవడం భ్రమ. రాంగోపాల్ వర్మ ఇతరుల సినిమాలని కూడా కాపీ కొడుతుంటాడు. షోలే సినిమాని ఆగ్ పేరుతో రీమేక్ చేసాడు. ఒరిజినల్ సినిమాలోని సన్నివేశాలని, పాత్రల పేర్లని మార్చకుండా తీశాడని ఒరిజినల్ సినిమా డైరెక్టర్ (నిర్మాత కొడుకు) రాంగోపాల్ వర్మ మీద కేసు వేసాడు. ఆగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది.

    ReplyDelete
  2. రాంగోపాల్ వర్మ మీరు చెప్పినవాటిల్లో 90% ఎప్పుడూ చెప్పలేదు. So, don't worry, he is fine and you are not ;)

    ReplyDelete
  3. చిన్నప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాలు చూసాను. అతని సినిమాలు ఎలాంటివో అవి చూస్తే అర్థమైపోతుంది. ఇతర నిర్మాతలు కూడా వయొలెన్స్ సినిమాలు తీసారు. అవి ఎంత వరకు హిట్ అయ్యాయి? అలాగే రాంగోపాల్ వర్మ సినిమాలైనా ఎప్పుడూ హిట్ అవుతాయనుకోలేము.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Ramu said most of the statements in this post.I saw him giving some of these statements in a live show on a channel.

    ReplyDelete
  6. రాంగోపాల్ వర్మ అప్పులపాలు అయిన తరువాత అతనికి అర్థం అవుతుంది. ఫాక్షన్ సినిమాలు తీసిన ఒక నిర్మాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ దగ్గర డబ్బుంది, డెబిట్స్ లేవు కాబట్టి ఎలా ఖర్చు పెట్టినా ఫర్వాలేదనుకుంటున్నాడు.

    ReplyDelete