Thursday, April 28, 2011

బాబా ఎప్పుడో చనిపోయాడని నేను చెబితే ఎవడూ నమ్మలేదు ... ఎవడో కన్నడ మీడియా వాడు చెబితే నమ్ముతున్నారు ... ఇదేం లోకంరా బాబూ

 శవపేటిక  ఆర్డర్ ఎప్పుడిస్తారు ? ... సదరు పార్టీ బాల్చీ తన్నేసినప్పుడుగానీ ... లేదా తన్నేయడానికి సద్ధంగా ఉన్నప్పుడుగానీ ఆర్డరిస్తారు. మన బాబా విషయంలో మొదటిదే కరెక్ట్. బాబా నాలుగో తారీఖునే అవతారం చాలించారు. ఇదంతా మీడియాకు మన రాజకీయ పెద్దలకు ఉప్పందింది. రఘువీరారెడ్డిగారు. ఎక్కడికో వెళ్ళాల్సిఉంది ... చంద్రబాబుగారేమో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి  కోయంబత్తూర్ వెళ్ళాల్సి ఉంది ... కిరణ్‌కుమార్ రెడ్డిగారేమో కేబినెట్ మీటింగ్ ఎనౌన్స్ చేసారు. అంతే ఆ రోజు సడన్‌గా అందరి ప్రోగ్రాంస్ మారిపోయాయి. పుట్తపర్తిలో హైడ్రామా మొదలైంది. మీడియా స్వరం పెంచింది . పుట్టపర్తిలో ఏదోజరిగిపోతుంది అని కోడైకూసింది. పట్టణంలో కరెంటు తీసేసారు. పోలీసు ఫోర్సును పెంచారు. అంతే ఆ తరువాత ఏమైందో తెలీదు ... మీడియా క్రమంగా తన స్వరాన్ని తగ్గించింది ... డాక్టర్లు రంగంలోకి దిగారు పూటకొకటి చెప్పున హెల్త్ బులిటెన్లను విడుదల చేసారు . డాక్టర్లు ఆశ్రమం గేటు ముందు బులిటెన్లు చదివి లోపలికి పోయేటప్పుడు సాలార్‌జంగ్ మ్యూసియంలోని గంట గంటకు గంటకొట్టి లోపలికిపోయి తలుపేసుకునే పొట్టోడు గుర్తొచ్చాడు నాకు. మా పని మేం చేస్తున్నాం మీరెలా చస్తే మాకేంటీ ? అన్నటుండేది వాళ్ళ ప్రవర్తన. నాకైతే ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది . ఆ మరుసటిరోజు అంటే ఏప్రిల్ ఐదున ... నేను రాసిన టపానే ... దేవుడు మరణించాడు ... ఒక బ్లాగరైతే బాబా చనిపోకుండా మీరు ఇలా రాయడం బాలేదని ... పోస్టు తొలగించమని నా బ్లాగులో కామెంటు రాసారు . అప్పటికే బాబా చనిపోయారని నా మనసు చెబుతుంది . అందుకే ఆ పోస్టుని అలాగే ఉంచేసాను. ఇదే బ్లాగులో మీరు ఆ పోస్టు చదువుకోవచ్చు .   

No comments:

Post a Comment