Tuesday, April 5, 2011

దేవుడు మరణించాడు

పుట్టపర్తి సాయిబాబా దాదాపుగా మరణించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గత రాత్రినుండి మీడియాలో వస్తున్న వివిధ పొంతనలేని కథనాలు , బాబా మెడికల్ బులిటెన్లు , పుట్టపర్తిలో భక్తులను సమాధాన పరచడానికి వైద్యులు ,అధికారులు చేస్తున్న వివిధ చేష్టలు ( పట్టణంలో విద్యుత్ తీసివేయడం , బాబా కాలు కదిపాడని , వేలు మెదిపాడని , తాగడానికి మచినీళ్ళు అడిగాడని  మొదలైనవి)  దీనిని రూడి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ రాజకీయ ప్రముఖులకు విషయం తెలియడంతో వారంతా తమ పర్యటనలను రద్దు చేసుకుని పుట్టపర్తి చేరుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రముఖులంతా పుట్టపర్తి చేరుకున్న తరువాత వార్తను అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ముందే ప్రకటిస్తే రాష్ట్రమంతా , ముఖ్యంగా పుట్టపర్తి అంతటా అలజడులు లేచి శాంతిభధ్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ అంచనా.   

3 comments:

  1. sir
    meeru ee tapaa 5th na raasaaru,appatiki mee ooha meediyaa kadhanaalanu batti correct avvavochhu,kaanee ee roju 8va tedee kanuka ippatikainaa meeru paina pettina heddingunu maarustoo veroka kadhanam raaste baaguntundi----.msr murty

    ReplyDelete
  2. మూర్తిగారూ ... బాబాని ప్రత్యక్షంగా చూస్తేనేగాని రాష్ట్రంలోని బాబా భక్తులు ఊపిరి పీల్చుకోరు .వారిలో ఇంకా ఆ అనుమానం మిగిలే ఉంది . అప్పటివరకు నేను ఈ ఆర్టికల్‌ను మార్చలేను . క్షమించండి.

    ReplyDelete
  3. మరి అయన మరణాన్ని ఏప్రిల్ 24 నే ఎందుకు ప్రకటించారు? ఆ తేది కాకుండా వేరే రోజున ప్రకటించ వచ్చు కదా ... ఆ రోజు టెండూల్కర్ బర్త్ డే . పాపం టెండూల్కర్ ఎంత బాధ పడ్డాడో తన బర్త్ డే రోజు ఇలా అయిందని......
    ఈ ఆర్టికల్ కి సంబంధిన ఇంక ఏమైనా విషయాలు ఉంటె ఆ నిజాలని కూడా బయటికి తీయండి. మన ప్రభుత్వ ధోరణి ని చూస్తే నిజాల్ని నిలువునా చంపడమే పనిగా పెట్టుకున్నాట్లు ఉంది.

    ReplyDelete