Sunday, September 26, 2010

హమ్మయ్య కొమరం పులి దొబ్బింది ... నా మనసు కుదుటపడింది


 కొమరం పులి విడుదలకు ముందు అది ఎక్కడ హిట్టయిపోతుందో మళ్ళీ పవన్ కళ్యాణ్ జనజీవన స్రవంతిలో కలిసిపోతాడోనని తెగ హైరానా పడిపోయేవాడిని. హిట్ కాదని ఖచ్చితంగా తెలుసు ... అయినా మనసులో చిన్న అనుమానం ... ఒకవేళ హిట్ అయితే ఏం చేయాలి ? - అనేది కొమరం పులి బడ్జెట్ అంత ప్రశ్న . మళ్ళీ అంతలోనే ధైర్యం ... కొమరం పులి హిట్ కాదని. అప్పుడు గుర్తొచ్చింది రెహమాన్ తెలుగులో సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు ఒక్కటికూడా ఆడలేదని. అంతే ఎక్కడి లేని ధైర్యం వచ్చేసింది. ఇక ప్రపంచంలో ఎవడూ కొమరం పులిని ప్లాప్ అవకుండా ఆపలేడు అన్న ధీమాతో  ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను.  తెల్లారింది ... శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాను ... ముందు ఆ వార్త ఎవడు చెబితే వాడికి ఒక ఆశ చాక్లెట్ ఇవ్వాలని ముందు రోజు రాత్రే కొన్నాను . ఆ సమయం రానే వచ్చింది ... సినిమా చూసి మా ఇంటి ముందు నుండి నీరసంగా పోతున్న వీర్రాజును ఆపి విషయం అడిగాను ... ఇంకేముందు మనం ఊహించిందే జరిగింది ... అంతే ఆ చాక్లెట్ను వాడి నోట్లో పెట్టి ఇంట్లోకి పరుగుతీసాను ...ఈ సంతోషాన్ని ఉదయ్ కిరణ్ అభిమానులతో పంచుకుందామని. విషయం అర్ధంకాని వీర్రాజు బుర్రగోక్కుంటూ సినిమా దొబ్బిందన్న బెంగతో చాక్లెట్ చీక్కుంటూ ఇంటి మొగం పట్టాడు. 
  
నేనూ ఒకప్పుడు  అందరిలానే చిరంజీవికి వీరాభిమానిని ... కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కటౌట్లు కట్టడం,  జెండాలు అంటించడం ( అంటించడమంటే అగ్గిపుల్ల గీసి అంటించడం కాదు ) లాంటివి కాకపోయినా ... మొదటిరోజు మొదటి ఆట చూసేటంత ... నచ్చినా నచ్చకపోయినా అయిదారుసార్లు చూడాల్సిందే. హిట్టు ప్లాపులతో నిమిత్తమేలేదు. అది బాసు సినిమా అయితే చాలు. ఇదంతా గత చరిత్ర . ఇప్పుడంతా తారుమారైపోయింది. అది ఎంతంటే బాసు సినిమా చూడకూడదన్నంత. ఏ ... ఎందుకంత కసి ... చిరంజీవి ఏం పాపం చేసాడు ...నీకేమైనా ద్రోహం చేసాడు అంటే ... నాకేం ద్రోహం చేయలేదు ... ఉదయ్ కిరణ్ కి చేసాడు ... అందుకే ఇదంతా. ఒకప్పుడు చిరంజీవి అంటే సినీ హీరోగానే కాదు మంచి మనిషిగా, కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా అభిమానించేవాడిని. బాసు ఏ విషయమైనా చాలా బేలన్స్ గా ఆలోశిస్తాడని, చాలా సున్నిత మనస్కుడని ఇండస్ట్రీలో పెద్ద పేరు. కానీ బాసు తన కూతురు వివాహ విషయంలో చాలా డొంకతిరుగుడుగా వ్యవహరించాడు. అతని స్తాయికి తగ్గట్టు ప్రవర్తించలేదు . ముందు తనే ఉదయ్ కిరణ్ తో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఉదయ్ ను చూస్తుంటే కెరియర్ మొదట్లో నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాడని ... అతనిలో తనను తాను చూసుకుంటున్నానని , అతనిది తనలానే కష్టపడే మనస్తత్వమని కూడా ప్రకటించాడు . ఇది విన్న ఉదయ్ కిరణ్ తన స్టైల్లో " చిరంజీవంటే తన కెంతో ఇష్టమని ... చిరంజీవికి తాను వీరాభిమానినన్ ఇ" ఎక్కడపడితే అక్కడ అడిగినవాడికి అడగనివాడికి కూడా చెప్పేవాడు . అప్పటికి ఉదయ్ కిరణ్ మంచి ఊపుమీద ఉన్నాడు . ఇంకేముంది మెగాస్టార్ కి కాబోయే అల్లుడు అంటూ అతన్ని మీడియా ఆకాశానికి ఎత్తేసింది. చాలా మంది నిర్మాతలు అతనితో సినిమాలు తీయడానికి క్యూ కట్టారు. అలాగే చిరంజీవి సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్స్ బేనర్ మీద ఒక సినిమా  చేద్దామనుకున్నారు. మీడియా అయితే ఏకంగా పెళ్ళి ఎక్కడ జరగనున్నదో ఊహించి గాలి కబుర్లు ప్రచారం చేసింది. చిరంజీవి సొంత గ్రామం మొగల్తూరు లో అని ఒకరోజు ... ఉదయ్ కిరణ్ ఊరు కాకినాడలో అని ఒకరోజు  ఇలా ఉండేవి మీడియా కథనాలు. పెళ్ళికి ప్రముఖులు రావడానికి వీలుగా మొగల్తూరులో హెలీపాడ్ ( హెలికాప్టర్లు , చిన్న చిన్న విమానాలూ దిగడానికి) కూడా సిద్ధం చేస్తున్నారంటూ మీడియా హోరెత్తించేది.
 
దాదాపు ఐదారు నెలలు ఈ వార్తతో మీడియా పండగ చేసుకుంది. ఉదయ్ కిరణ్ ను  తన్నకపోయినా బూరెల బుట్టలో పడ్డాడనుకున్నాను ... అతనికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందనుకున్నాను. అంతే ఒకానొక రోజు బాసు చావు కబురు చల్లగా చెప్పాడు ... రెండువైపుల కుటుంబాలు ఆలోశించి  నిశ్చితార్ధం రద్దు చేసుకున్నామని ... కానీ కారణాలు చెప్పలేదు. ఎతావాతా తెలిసింది ఏంటంటే చిరంజీవి  ఉదయ్ కిరణ్ ఒకే కమ్యూనిటీ కాదంట. అందుకని బామ్మర్ది , చిన్నతమ్ముడు సంబంధం కేన్సిల్ చేయమని ఇంట్లో గొడవ పెడితే వాళ్ళ పోరు పడలేక ఈ నిర్ణయం తీసుకున్నాడట .అప్పటినుండీ ఉదయ కిరణ్ కెరియర్ మసకబారింది. అతను సినిమాలలో కనిపించడమే మానేసాడు. ఇప్పుడైతే ఎక్కడున్నాడో కూడా తెలీదు. దీనికంతటికీ కారణం ఎవరు ... బాసు అతని తమ్ముడు, బామ్మర్ది. అంతే నాకు ఎక్కడో కాలింది. అప్పటివరకూ బాసు మీద ఉన్న అభిమానమంతా వికారంగా మారింది . ఏంటీ ఇదంతా ... బాసుకు ఈ విషయం ముందు తెలీదా ? చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టే బాసు ఎందుకింత అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు అని ఒకటే ఆలోచన . పక్కనున్న రజనీకాంత్ చూడండి కూతురు ప్రేమించిన వ్యక్తితో ( తన స్థాయికి తగకపోయినా ) పెళ్ళి జరిపించి పెద్దమనిషి అనిపించుకున్నాడు. ఎందుకు బాసు రజనీలా ఆలోచించలేకపోయాడు . దీనికంతటికీ కారణం తమ్ముడు, బామ్మర్ది . అంతే అప్పటినుండి చిరంజీవి కేరెక్టర్ మీద నాకొక అపనమ్మకం ... అతని కమిట్మెంట్ మీద అవిశ్వాసం. అప్పటినుండీ అతని సినిమాలంటే వ్యతిరేకత . సినిమాలో అతను చెప్పే నీతులన్నీ వట్టిదే అని నమ్మకం . అప్పటినుండి వాళ్ళ సినిమాలు దొబ్బెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను      

*ఈ సోదంతా ఎవ్వరినీ బాధ పెట్టడానికి కాదు ... నన్ను నేను సంతృప్తి పరచుకోవడానికి మాత్రమే

6 comments:

  1. మీ బాధ నా కర్ధమైంది. ఇంకో విషయం, ఉదయ్ కిరణ్ తన కులం కాదని చిరంజీవికి ముందే తెలుసు. మనం ఇప్పటికైనా ఈ కులం గోడల్ని బద్ధలు కొట్టకపోతే ఎలా? అని ఒక పెద్ద డైలాగ్ కూడా బాసు మీడియా సాక్షిగా చెప్పాడు.

    ReplyDelete
  2. అడవి బాపిరాజు వ్రాసిన నారాయణరావు నవలలోని డైలాగ్ "వెధవ కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు". చిరంజీవి చెప్పినవి ఆ కబుర్లే కదా. కొంత మందికి మాటలు వేరు, చేతలు వేరు.

    ReplyDelete
  3. ఈ లెక్కన చరిత్రలో ఎంతో మంది ఉదయ్ కిరణ్ లు ,కొంతమంది ద్రోహులు (ఇది చాలా చిన్న మాట )వల్ల చాలా భాదలు పడింటారు,ఆ ద్రోహులను శిక్షించే వాడు ఎవడు ?

    ReplyDelete
  4. actual ga uday kiran ki oka affiar vundani, andukey chiranjeevi family athani ki chedda peru rakunda yedo reason cheppi pelli apparani kuda pukaru vindi! mari daanikemantaru! + uday kiran swayanga cheppadu, chiru family ki thanaki yen problems levani, mutual understanding medey pelli aapamani! nenu yedo paper lo chadivanu aa time lo! yevado raasindo, cheppindo guddiga chadivi vini, notikochinattu mataladey vedhavalu vunnantha kalam ilanti pukarlu vasthuney vuntay!

    ReplyDelete