Wednesday, September 29, 2010

పాపం తోట కన్నారావ్ ... రోబో ఏమవుతుందోనని బెంగెట్టుకున్నాడట


క పక్క రోబో రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. అభిమానులంతా ఉత్కంఠంగానూ మరింత ఆశక్తిగానూ ఎదురు చూస్తున్నారు. కానీ రాజమండ్రిలోని ఒక వ్యక్తి మాత్రం శ్రీకృష్ణ ట్రేడర్స్  ఆఫీసులో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ... మనిషి టెన్షన్ గా ఉన్నాడు. మధ్య మధ్యలో ఫోను మాట్లాడుతున్నాడు ... ఎవరెవరికో సూచనలిస్తున్నాడు ... అంతా మనీ మేటర్. అతనే రోబో సినిమా తెలుగు హక్కులు పొందిన తోట కన్నారావ్. కన్నారావు సినిమా నిర్మాత కాదు ... అంతకు మునుపు ఒక్క సినిమా కూడా తీసి ఎరుగడు  ... ఆ మాట కొస్తే సినిమా రంగానికి అతను పూర్తిగా కొత్త . మరి అలాంటి వ్యక్తికి ఆ సినిమా హక్కులెలా వచ్చాయి ... పరిశ్రమలోని కొమ్ములు తిరిగిన నిర్మాతలను కాదని అతను ఎలా సంపాధించాడు. ఎక్కడో రాజమండ్రిలో జొన్నల వ్యాపారం చేసుకునే కన్నారావుకి రోబో హక్కులు తీసుకోమని ఎవరు చెప్పారు ? ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా పరిశ్రమకి సంబంధంలేని వ్యక్తికి రైట్స్ ఎలా దక్కాయి ? ... అందుకు సహకరించింది ఎవరు - చక్రం తిప్పిందెవరు ? అంటే  సమాధానం సింపుల్ ... మన మెగాస్టార్ చిరంజీవి . అవును అక్షరాలా నిజం. గోదావరి జిల్లాలలో మెగాస్టార్ కి బంధుగణం ఎక్కువే ... పైగా బాసుకు మంచి పట్టున్న, ఇష్టమైన జిల్లాలు . ఆ బంధుగణంలోని ఒకానొక వ్యక్తే ఈ తోట కన్నారావ్. పోయిన ఎన్నికలలో పి.ఆర్.పి టిక్కెట్ ఆశించి భంగపడ్డాడట. అందుకు ప్రతిగా మన మెగాస్టార్ ఈ ఉపకారం చేసిపెట్టాడట. కన్నారావ్ కి హక్కులు తీసుకోవడం ఇష్టం లేదట ... జొన్నల వ్యాపారంలో పైసా పైసా కూడబెట్టి ఈ స్థాయికొచ్చాను ... ఒకేసారి 30 కోట్లు వెదజల్లాలంటే రిస్కు ఎక్కువ అన్నాడట ... పైగా మనకు టచ్ లేని ఫీల్డు అని మొత్తుకున్నాడట. నీకేం పర్లేదు నీ వెనుక నేనుంటాను అని బాసు భరోసా ఇస్తే జొన్నల వ్యాపారంలో కూడబెట్టిందంతా బయటకు తీసాడట.   అంతవరకూ బానే ఉంది ... ఇదే సినిమాకి హక్కులు కోసం ప్రయత్నించి భంగపడ్డ అవతలి పార్టీ సినిమా విడుదల కాకుండా (వీలైతే విడుదల ఆలస్యం అయ్యేటట్టు) అడ్డంకులు సృష్టిస్తుందట. కన్నారావ్ సినిమాని ఎలా ఆడిస్తాడో చూత్తాం అని ప్రతిజ్ఞలు కూడా చేసారట . ఒక పక్క థియేటర్లు దొరకకుండా చేయడం ... కన్నరావుకి ఫీల్డ్ కొత్త కావడంతో ఎగ్జిబిటర్లు/డిస్టిబ్యూటర్లు  పావలాకి రూపాయికీ బేరాలాడటంలాంటి పనులు చేస్తున్నరట. 30 కోట్లు ఖర్చు పెట్టేసాను ... బిజినెస్ పూర్తికాలేదు ... ఒకసారి  సినిమా విడుదల వాయిదా వేసాను అని తోటి జొన్నల వ్యాపారస్థుల దగ్గర వాపోతున్నాడట ... Any How సినిమా విడుదల అవ్వాలని ... ఆపై ఘన విజయం సాధించాలని కోరుకుందాం ... ఎందుకంటే కన్నరావ్ గురించి కకపోయినా నా గురించైనా సినిమా హిట్టవుతుంది ... ఎందుకంటే నేను శంకర్ అభిమానిని కదా.  
Sankar's Official Website: 
http://www.directorshankaronline.com/

2 comments:

  1. ఈ తోట కన్నారావుది మా పక్క ఊరే నండి ఎర్నగుడెం .మీ రన్నట్టు పెద్ద జొన్న వ్యాపారెమీ కాదండి .చిన్న వ్యాపారే ,చుట్టూ పక్కల రైతుల వద్ద ధాన్యము కుడా కొనేవాడు.మా వాళ్ళందరికీ బాగా తెలిసిన వాడే. కానీ ఇతను ఈ సినిమా హక్కులు ఎలా పొందాడా ?అని అందరూ ఆశ్చర్య పోతున్నారు .

    ReplyDelete
  2. he got it with the help of a distributor. never heard that he is relative to chiru. r u sure?

    ReplyDelete